కూలిన హెలికాప్టర్: 11 మంది దుర్మరణం | Norway helicopter crash: '11 killed' near Bergen | Sakshi
Sakshi News home page

కూలిన హెలికాప్టర్: 11 మంది దుర్మరణం

Apr 29 2016 7:42 PM | Updated on Sep 3 2017 11:03 PM

నార్వేలో ఓ ప్రేవేటు సంస్థకు చెందిన హెలికాప్టర్ కూలి 11 మంది మరణించారు.

 నార్వేలో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన హెలికాప్టర్ కూలి 11 మంది మరణించారు. మృతుల్లో తొమ్మిది మంది నార్వేకు చెందిన వారు కాగా, ఒకరు బ్రిటన్, మరొకరు ఇటలీకి చెందిన వారు ఉన్నారు. గల్పాక్స్ చమురు క్షేత్రాలనుంచి బెర్జెన్ కు హెలీకాప్టర్ వెలుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

టురోయి ద్వీపకల్పం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైంది. మృతులందరూ స్టాట్‌ఆయిల్ సంస్థకు చెందిన ఉద్యోగులు. ప్రమాదం జరిగిన సమయంలో 13 మంది హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారు. వీరిలో 11 మంది మృతిచెందగా, ఇద్దరి కోసం రెస్క్యూ టీం గాలింపుచర్యలు ముమ్మరం చేసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement