సోషల్ మీడియాకు ఆ కమెడియన్ దూరం | No more social media for Russell Brand | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాకు ఆ కమెడియన్ దూరం

Aug 22 2015 10:05 AM | Updated on Oct 22 2018 6:02 PM

సోషల్ మీడియాకు ఆ కమెడియన్ దూరం - Sakshi

సోషల్ మీడియాకు ఆ కమెడియన్ దూరం

సినిమాల్లోనే కాదు..సోషల్ మీడియాల్లోనూ తన హాస్యంతో అపారమైన ఫాలోవర్సును సంపాదించిన బ్రిటీష్ హాస్యనటుడు రస్సెల్ బాండ్ సోషల్ మీడియా నుంచి కాస్త దూరంగా ఉండాలనుకుంటున్నాడు.

లాస్ ఎంజెల్స్: సినిమాల్లోనే కాదు..సోషల్ మీడియాల్లోనూ తన హాస్యంతో అపారమైన ఫాలోవర్సును సంపాదించిన బ్రిటీష్ హాస్యనటుడు రస్సెల్ బాండ్ సోషల్ మీడియా నుంచి కాస్త దూరంగా ఉండాలనుకుంటున్నాడు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి... పనిలో మార్పు కోసం కొన్ని రోజులు ట్విట్టర్, ఫేస్బుక్లతో పాటూ ఆయన ప్రారంభించిన 'ద ట్రూస్' యూట్యూబ్ చానల్కు కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకుంటున్నాడు.
 నేను కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటున్నా.. సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో కొత్త మార్పులు కూడా వస్తున్నాయి...కొత్తగా ఆలోచించడానికి సమయం దొరుకుతుంది. ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నా అని రస్సెల్ బాండ్ తెలిపారు.
మన హాస్యాస్పద సంభాషణలు ఇక సోషల్ మీడియాలో ముగిశాయి.. ఇంత కాలం నన్ను సపోర్టు చేసిన వారందరికి కృతజ్ఞతలు..అంటూ సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పారు. అయితే ఇది తాత్కాలికమా లేక శాశ్వతంగా దూరంగా ఉంటారో మాత్రం చెప్పలేదు. రస్సెల్ బాండ్కు ట్విట్టర్లో10.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement