చీలిక దిశగా నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ

Nepal Communist Party Inching Towards Split - Sakshi

కఠ్మాండు: నేపాల్‌ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి, నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పుష్పకుమార్‌ దహల్‌ ‘ప్రచండ’ మధ్య సయోధ్య కుదరక పోవడంతో అధికార పార్టీలో చీలిక దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చైనా అనుకూలుడిగా పేరున్న ఓలి తరఫున నేపాల్‌లో చైనా రాయబారి హౌ యాంకుయి రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తుండటం గమనార్హం.

చైనా రాయబారి గురువారం ప్రచండను ఆయన నివాసంలో కలిసి చర్చలు జరిపారు. ప్రధాని ఓలి రాజకీయ భవితవ్యం శుక్రవారం జరగనున్న పార్టీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో తేలిపోనుంది. కాగా, కమ్యూనిస్ట్‌ పార్టీ స్టాండింగ్‌ కమిటీ ఇప్పటి వరకు 4 పర్యాయాలు భేటీ అయినా ఇద్దరు నేతల వివాద పరిష్కారం కోసం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేకపోయింది.  (భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు.. నేపాల్‌ ప్రధానికి షాక్‌)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top