అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించిన నాసా

NASA Posts The Sun looking Like Giant Flaming Jack O Lantern - Sakshi

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఓ అపురూప దృశ్యాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. సాధారణంగా కంటే ఎన్నో రెట్లు అధికంగా వెలుగులు జిమ్ముతున్న గుండ్రటి గుమ్మడికాయ ఆకారాన్ని పోలిఉన్న సూర్యుడి చిత్రాన్ని నాసా పోస్ట్‌ చేసింది. సూర్యుడి చుట్టూ ఉండే కరోనా భాగంలో ఉండే తీవ్రమైన అయస్కాంత క్షేత్రాలు కారణంగా సూర్యుడు వెలిగిపోతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, 73, 193 ఆంగ్‌స్ట్రాంగ్‌ల యూనిట్ల అతినీలలోహిత కిరణాల కలయిక కారణంగా ఇమేజ్‌ అంత కాంతివంతంగా వచ్చినట్లు నాసా పేర్కొంది.

సాధారణంగా ఆంగ్‌స్ట్రామ్స్‌ బంగారం, పసుపు రంగులలో హాలోవీన్ రూపాన్ని ఏర్పడటానికి ఉపయోగపడుతుందని తెలిపింది. కాగా హాలోవీన్‌ రూపంలో అద్భుతమైన ఈ దృశ్యాన్ని అందరూ తమ వద్ద భద్రపరుచుకోవాలని నాసా పిలుపునిచ్చింది. సూర్యుడిని నిత్యం గమనిస్తున్న నాసా సోలార్‌ డైనమిక్‌ ఆబ్‌సర్‌వేటరీ ఈ చిత్రాన్ని తీసింది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top