కౌంటింగ్ ఆపాలని నేపాల్ మావోయిస్టుల పిలుపు.. ఎన్నికల్లో పరాజయం | Maoists for halting vote count in Nepal | Sakshi
Sakshi News home page

కౌంటింగ్ ఆపాలని నేపాల్ మావోయిస్టుల పిలుపు.. ఎన్నికల్లో పరాజయం

Nov 21 2013 3:54 PM | Updated on Sep 2 2017 12:50 AM

నేపాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎన్-మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి ప్రాథమిక ఫలితాల్లో నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్ పార్టీలు ముందంజలో ఉన్నాయి.

నేపాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎన్-మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి ప్రాథమిక ఫలితాల్లో నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్ పార్టీలు ముందంజలో ఉన్నాయి. ఓటమిని జీర్ణించుకోలేని మావోయిస్టులు కౌంటింగ్ను ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో కుట్ర జరిగిందని, కౌంటింగ్ను వెంటనే ఆపాలని ఆరోపించింది.

ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్ పార్టీలు కోరాయి. తాజా ఫలితాల్లో మావోయిస్టు చైర్మన్ ప్రచండకు ఘోర పరాభవం ఎదురైంది. నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి రాజన్ చేతిలో ఓటమి చవిచూశారు. సుశీల్ కోయిరాలా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్ 69, సీపీఎన్-యూఎంఎల్ 58 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా సీపీఎన్-మావోయిస్టు కేవలం 16 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహిస్తున్నామని నేపాల్ చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ నీల్కాంత ఉప్రేటి తెలిపారు. ప్రజాభిప్రాయన్ని గౌరవించాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement