అత్యంత ప్రభావవంతమైన ఏసియన్‌గా మలాలా | malala yousafzai stood as most influential asian | Sakshi
Sakshi News home page

అత్యంత ప్రభావవంతమైన ఏసియన్‌గా మలాలా

Nov 29 2013 1:34 AM | Updated on Sep 2 2017 1:04 AM

అత్యంత ప్రభావవంతమైన ఏసియన్‌గా మలాలా

అత్యంత ప్రభావవంతమైన ఏసియన్‌గా మలాలా

బ్రిటన్‌లో అత్యంత ప్రభావవంతమైన ఆసియా వ్యక్తిగా పాక్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ నిలిచారు. గరావీ గుజరాత్2(జీజీ2) అనే వారపత్రిక రూపొందించిన ‘జీజీ2 పవర్ 101’ జాబితాలో ఆమె మొదటి స్థానంలో నిలిచారు.

లండన్: బ్రిటన్‌లో అత్యంత ప్రభావవంతమైన ఆసియా వ్యక్తిగా పాక్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ నిలిచారు. గరావీ గుజరాత్2(జీజీ2) అనే వారపత్రిక రూపొందించిన ‘జీజీ2 పవర్ 101’ జాబితాలో ఆమె మొదటి స్థానంలో నిలిచారు. గురువారం రాత్రి ఇక్కడ జరిగిన జీజీ2 నాయకత్వ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో మలాలాతోపాటు బాలికా విద్య కోసం స్వాత్ లోయలో తాలిబన్ల తూటాలకు ఎదురొడ్డిన కైనాత్ రియాజ్, షాజియా రంజాన్‌లకు జీజీ2 హ్యామర్ అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మలాలా హాజరుకాకున్నా.. రికార్డు చేసిన తన సందేశాన్ని పంపించారు. జాబితాలో బ్రిటన్ ఎంపీ కీత్ వాజ్ రెండు, స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ మూడు స్థానాల్లో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement