బీజింగ్: చైనాలో బయటపడిన ప్రాణాంతక వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని పొట్టనబెట్టుకున్న ఈ వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్-19 నామకరణం చేసిన విషయం తెలిసిందే. చైనా వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం ఈ వైరస్ సంక్రమించి ప్రాణాలు కోల్పోయినవారు, అనుమానితుల వివరాలు ఇలా ఉన్నాయి. (కోవిడ్-19 : ముద్దులకు దూరంగా ఉంటేనే మంచిది)
| దేశం | కేసుల సంఖ్య | మృతుల సంఖ్య |
| చైనా | 78,064 | 2,715 |
| హాంకాంగ్ | 81 | 2 |
| దక్షిణ కొరియా | 1,146 | 11 |
| మకావో | 10 | - |
| జపాన్ | 860 | 4 |
| ఇటలీ | 323 | 11 |
| ఇరాన్ | 95 | 15 |
| సింగపూర్ | 91 | - |
| థాయిలాండ్ | 37 | - |
| యూఎస్ | 57 | - |
| తైవాన్ | 31 | 1 |
| ఆస్ట్రేలియా | 23 | - |
| మలేషియా | 22 | - |
| బహ్రెయిన్ | 17 | - |
| వియత్నాం | 16 | - |
| జర్మనీ | 17 | - |
| యూఏఈ | 13 | - |
| యునైటెడ్ కింగ్‌డమ్ | 13 | - |
|
ఫ్రాన్స్ |
14 | 1 |
| కెనడా | 11 | - |
| కువైట్ | 11 | - |
| ఇరాన్ | 5 | - |
| ఫిలిప్పీన్స్ | 3 | 1 |
| స్పెయిన్ | 6 | - |
| రష్యా | 2 | - |
| ఇజ్రాయెల్ | 2 | - |
| ఒమన్ | 2 | - |
| ఆస్ట్రియా | 2 | - |
| లెబనాన్ | 1 | - |
| బెల్జియం | 1 | - |
| నేపాల్ | 1 | - |
| శ్రీలంక | 1 | - |
| స్వీడన్ | 1 | - |
| కంబోడియా | 1 | - |
| ఫిన్లాండ్ | 1 | - |
| ఈజిప్ట్ | 1 | - |
| అల్జీరియా | 1 | - |
| అఫ్ఘనిస్తాన్ | 1 | - |
| క్రొయేషియా | 1 | - |
| స్విట్జర్లాండ్ | 1 | - |
అదేవిధంగా కోవిడ్ తీవ్రత వల్ల చైనాలో విధించిన ప్రయాణ ఆంక్షలు కొనసాగుతున్నాయి. వ్యాధి లక్షణాల కనిపించిన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక దక్షిణ కొరియాలో సైతం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక్కడ దాదాపు 1150 మందికి వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. దక్షిణ కొరియాలో ఉన్న తమ సైనికునికి ఈ వైరస్ సోకినట్లు అమెరికా మిలటరీ తెలిపింది. జపాన్‌లో కూడా కోవిడ్ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. మొత్తం 860 కేసులు నమోదు కాగా, డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ఉన్న 691 మంది అనుమానితులుగా ఉన్నారు. ఇందులో నలుగురు ప్రయాణికులు మరణించారు. ఈ వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో టోక్యో ఒలంపిక్స్ నిర్వహణపై సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని నిర్వాహకులు తెలిపారు. ఇక ఇటలీలో కూడా వైరస్ వ్యాప్తి పెరుగుతోందని ఇప్పటికే ఈ వైరస్ సోకి పదిమంది మృతి చెందారని అధికారులు తెలిపారు.


