ట్రంప్‌ గెలిచినా నేనక్కడ ఉండను: ఇవాంకా | Ivanka Trump Hints She Leave White House If Father Wins 2020 | Sakshi
Sakshi News home page

వైట్‌ హౌస్‌ వదిలేసి వచ్చేస్తా: ఇవాంకా

Dec 29 2019 10:22 AM | Updated on Dec 29 2019 12:21 PM

Ivanka Trump Hints She Leave White House If Father Wins 2020 - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తన తండ్రి గెలిచినప్పటికీ వైట్‌ హౌస్‌లో ఉండనని తేల్చి చెప్పారు. ఇవాంకా ట్రంప్‌ ఇటీవలే ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్‌ మళ్లీ గెలిస్తే ఆయన పాలకవర్గంలో కొనసాగుతారా అని వారు ప్రశ్నించారు.

దానికి ఇవాంకా సమాధానమిస్తూ తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని ఖరాఖండిగా చెప్పారు. మొదట తన పిల్లల కోసం, వారి సంతోషం కోసం సమయం కేటాయించాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అయితే ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నా తను చేయాల్సింది ఇంకా మిగిలే ఉందని చెప్పుకొచ్చారు. ఎంతో చేసినప్పటికీ, అది సరిపోదని అన్నారు. కాగా ఇవాంకా ట్రంప్‌, ఆమె భర్త జారెడ్‌ కుష్నర్‌ 2017లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌ తరపున ప్రచారం చేపట్టారు. అతని గెలుపు తర్వాత పాలకవర్గంలోనూ భాగమైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement