కేన్స్ - ఐష్ | ish at canes festival | Sakshi
Sakshi News home page

కేన్స్ - ఐష్

May 23 2015 11:52 AM | Updated on Sep 3 2017 2:34 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నీలికళ్ల సోయగం ఐశ్వర్యరాయ్ హల్ చల్ చేసింది. ఫిష్ కట్ ఫ్రాక్ లో మెరిసిపోయింది. '

కేన్స్ : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో  నీలికళ్ల సోయగం ఐశ్వర్యరాయ్  హల్ చల్ చేసింది. ఫిష్ కట్ ఫ్రాక్ లో మెరిసిపోయింది. 'టూ డేస్ వన్ నైట్' మూవీ ప్రీమియర్ షోకు  వెళ్లి  అందరినీ ఐస్ చేసింది. ఇప్పటికే పలుసార్లు కేన్స్ ఫెస్టివల్లో ఈ ప్రపంచ సుందరి తళుక్కుమన్నా,  ఈ సారి మూడేళ్ల కూతురు ఆరాధ్యతో  హాజరుకావడం ప్రత్యేకత. దీంతో ముగ్ధ మనోహరమైన ఐష్ను  తమ కెమెరాలో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీలు పడ్డారు.  

మరోవైపు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తో వివాహం,  ఒక పాపకు జన్మనిచ్చిన మూడేళ్ల తరువాత   తన రెండవ ఇన్సింగ్స్  మొదలు పెట్టింది ఈ ఫ్యాషన్ ఐకాన్.  దీంతో తమ అభిమాన తారను  వెండితెరపై  చూసేందుకు అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.


 కాగా 68వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బాలీవుడ్ నటీమణులు సందడి చేశారు. యువ నటి సోనమ్ కపూర్, సెక్సీ బాంబ్ మల్లికా షెరావత్ సోనమ్ కపూర్ రెడ్ కార్పెట్పై హొయ లొలికించారు. అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ - 2015 వేడుకలు  ఆదివారం ముగియనున్నాయి.


Advertisement

పోల్

Advertisement