'మా నాన్న ఎలాంటివాడో నాకు తెలుసు' | I Believe My Father : Ivanka Trump | Sakshi
Sakshi News home page

'మా నాన్న ఎలాంటివాడో నాకు తెలుసు'

Feb 28 2018 4:17 PM | Updated on Aug 25 2018 7:52 PM

I Believe My Father : Ivanka Trump - Sakshi

న్యూయార్క్‌ : తన తండ్రి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై వచ్చిన లైంగిక అంశాలపరమైన ఆరోపణలను ఇవాంక ట్రంప్‌ కొట్టిపారేశారు. అసలు అలాంటి ప్రశ్నే తగినది కాదని అన్నారు. అమెరికా అధ్యక్షుడి పరిపాలన వర్గంలో ఇవాంక ట్రంప్‌ కూడా ప్రముఖ సీనియర్‌ సలహాదారుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ కొరియాలో జరిగిన వింటర్‌ ఒలింపిక్స్‌ క్రీడల ముగింపు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమెను ఓ ఎన్‌బీసీ అనే ఓ మీడియా ఇంటర్వ్యూ చేసింది.

ఈ సందర్భంగా ట్రంప్‌ పలువురు మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకున్నారని, పోర్న్‌స్టార్‌తో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై మీ స్పందన ఏమిటని ప్రశ్నించగా ఆమె కొట్టి పారేశారు. 'నేను అనుకుంటున్నాను ఓ కూతురును అడిగేందుకు ఇది ఏమాత్రం అర్హమైన ప్రశ్నకాదని. తన తండ్రిని నిందించే వాళ్లను ఆమె నమ్మబోదు. నేను మా నాన్నను నమ్ముతున్నాను. మా నాన్న ఏమిటో నాకు తెలుసు. నా తండ్రిని నమ్మేందుకు ఓ కూతురిగా నాకు ఆ హక్కు ఉందని అనుకుంటున్నాను' అని ట్రంప్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement