కొత్తరకం డైనోసార్ అస్థిపంజరం గుర్తింపు!

టాంజానియా : డైనోసార్ల గురించి జరిగే చర్చ అంతా ఇంతా కాదు. వేల ఏళ్ల కిందట అంతరించి పోయిన ఈ జీవులపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి సంబంధించిన కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా ఆఫ్రికాలో మరో కొత్త జాతి డైనోసార్ అస్థిపంజరాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తోక భాగాల్లో గుండె ఆకారంలో ఎముక ఉండడం ఈ డైనోసార్ల ప్రత్యేకత. టైటనోసారస్ జాతికి ఈ చెందిన ఈ డైనోసార్ శిలాజాన్ని టాంజానియాలోని మొటుకా నది సమీపంలో ఉన్న ఓ క్వారీలో గుర్తించినట్లు మిడ్ వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు.
పొడవైన మెడ, 70 టన్నుల బరువుతో ఉండే ఈ డైనోసార్లు నాలుగు కాళ్లపై నడిచేవని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సుమారు ఆరున్నర కోట్ల ఏళ్ల కిందట క్రిటేషియస్ శకంలో అంతరించిపోయిన డైనోసార్లలో ఇవీ ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. సాధారణంగా తోక భాగంలో గుండె ఆకారంలోని ఎముకతో కూడిన రాక్షసి బల్లులు అరుదని, కానీ తాము కనుగొన్న డైనోసార్ అస్థిపంజరం తమ అంచనాలను మార్చిందని ఈ పరిశోధకులు అంటున్నారు. పరిశోధనలు కొనసాగుతున్నాయని, ఇవి మాంసాహారులా కాదా అనే విషయం తేలాల్సి ఉందని పేర్కొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి