ఫోర్బ్స్‌ బిలీనియర్‌ ఆస్తుల వేలం!!

He Was On Forbes '100 Richest' List. Now Saudi Will Auction His Assets - Sakshi

రియాద్‌ : 10 ఏళ్ల క్రితం ఫోర్బ్స్‌ ప్రకటించే 100 ధనికుల జాబితాలో ఆయన ఒకరు. సౌదీ అరేబియాలో అతనొక బడా బిలీనియర్‌. కానీ ప్రస్తుతం అతని ఆస్తులన్నీ వేలానికి వచ్చాయి. ఆ కోట్లన్నీ ఎక్కడికి పోయాయో..? తీసుకున్న రుణాలు చెల్లించలేక చేతులెత్తేశాడు. చివరికి ఆయన ఆస్తులన్నింటిన్నీ అమ్మి, రుణదాతలు, తమ సొమ్మును రాబట్టుకోవాల్సిందిగా.. రుణ పరిష్కార ట్రిబ్యునల్‌ ఆదేశించింది. 

మాన్‌ అల్‌- సానియా ఒకప్పుడు సౌదీ అరేబియా అత్యంత ధనిక వంతుడు. 2007 ఫోర్బ్స్‌ జాబితాలో చోటు కూడా దక్కించుకున్నాడు. కానీ తన కంపెనీ సాద్‌ గ్రూప్‌, క్రెడిటార్లకు చెల్లించాల్సిన బిలినియన్‌ రియల్స్‌ను చెల్లించలేదు. 2009 నుంచి రుణాలు తిరిగి చెల్లించడం మానేశాడు. సాద్‌ గ్రూప్‌ దివాలా తీసింది. దీంతో అతన్ని గతేడాది అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. సాద్‌ గ్రూప్‌ నుంచి రుణాలు రాబట్టుకోవడం కోసం క్రెడిటార్లు దాదాపు తొమ్మిదేళ్ల నుంచి వేచి చూస్తున్నారు. ఇదే సౌదీ అరేబియాలో దీర్ఘకాలికంగా నడుస్తున్న అతిపెద్ద రుణ వివాదం. 

ఈ రుణ వివాద కేసును పరిష్కరించేందుకు ముగ్గురు జడ్జిలతో కూడిన ట్రిబ్యునల్‌ గతేడాది ఇత్‌కాన్‌ అలియన్స్‌ అనే కన్సోర్టియంను ఏర్పాటు చేసింది. ఈ కన్సోర్టియం ఐదు నెలల్లో సాద్‌ గ్రూప్‌నకు చెందిన ఆస్తులను వేలాల ద్వారా విక్రయించాల్సి ఉంది. తొలి వేలంలో సంస్థకు చెందిన అభివృద్ధి చెందని, వాణిజ్య భూములను విక్రయించాలి. తూర్పు ప్రావిన్స్ ఖోబార్, డమ్మామ్‌లలో ఉన్న ఆదాయ, ఉత్పత్తి నివాస భవనాలను వేలం వేయాల్సి ఉంది. వీటిని అక్టోబర్‌ చివరిన వేలం వేయనున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. మార్చిలోనే వేలంలో తొలి దశగా సాద్‌ గ్రూప్‌కు చెందిన 900 వాహనాలను ఇత్‌కాన్‌ విక్రయించింది. ఆ వేలంలో 125 మిలియన్‌ రియాన్లను పొందింది. వీటి ద్వారా అప్పటి వరకు ఉద్యోగులకు చెల్లించని వేతనాలను చెల్లించారు.

ఆ తర్వాత వేలాల్లో బ్యాంకులతో కలిపి 34 మంది క్రెడిటార్లకు రుణాలను తిరిగి చెల్లించనున్నారు. సాద్‌ గ్రూప్‌ బ్యాంక్‌లకు 22 బిలియన్‌ డాలర్లు(లక్షన్నర కోట్లు) చెల్లించాల్సి ఉంది. అయితే మొత్తంగా సాద్‌ గ్రూప్‌కు 40 బిలియన్‌ రియాల్స్‌ నుంచి 60 బిలియన్‌ రియాల్స్‌ వరకు రుణాలు ఉంటాయని కొంతమంది అంచనావేస్తున్నారు. సానియా ఆస్తులన్నీ అమ్మి, క్రెడిటార్లకు బకాయిలు చెల్లించన తర్వాత అతన్ని విడుదల చేస్తారో లేదో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం అతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top