‘కీలకమైన సమాచారం రాబట్టేందుకు ఎంతకైనా తెగిస్తారు’

Fox News Host Jesse Watters Objectionable Comments On Women Reporters - Sakshi

వాషింగ్టన్‌ : మహిళా రిపోర్టర్లపై ఫాక్స్‌ న్యూస్‌ వ్యాఖ్యాత జెస్సీ వాటర్స్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కీలకమైన సమాచారం రాబట్టేందు వారు ఎంతకైనా తెగిస్తారని వ్యాఖ్యానించాడు. సోర్స్‌తో ఓ రాత్రి గడిపేందుకు సిద్ధపడతారని ఫాక్స్‌ న్యూస్‌ టాక్‌ షో ‘ది పైవ్‌’లో చెప్పుకొచ్చాడు. సినిమాలు, టీవీ షోల్లో చూపుతున్నట్టు నిజ జీవితంలో కూడా అలాంటి పాత్రలు ఉంటాయని పేర్కొన్నాడు. తమ సంస్థలో అలీ వాట్కిన్స్‌ అనే మహిళా రిపోర్టర్ ఇలాంటి పని చేసే నాలుగేళ్లపాటు పొలిటికల్‌ వార్తల్ని అందరి కన్నా ముందుగా.. గొప్పగా ఇచ్చేదని తెలిపాడు.

ఇక అట్లాంటా-జర్నల్ కాన్స్టిట్యూషన్ రిపోర్టర్‌ కేథీ ష్రగ్స్‌ జీవితం ఆధారంగా రిచర్డ్‌ జువెల్‌ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.  రహస్య సమాచారం కోసం కేథీ ష్రగ్స్‌ సెక్స్ వ్యాపారం చేసిందనేది కథాంశం.  వివాదాస్పద కథాంశంతో వార్తల్లో నిలిచిన రిచర్డ్‌ జువెల్‌ సినిమా వాటర్స్‌ వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశమైంది. గతంలోనూ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వాటర్స్‌ తాజా ఘటన నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఘటనపై అమెరికన్‌ టెలివిజన్‌ వ్యాఖ్యాత ఎస్‌సీ కప్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. నిరాధార, నిందారోపణలు చేస్తున్న వాటర్స్‌ వ్యాఖ్యలు చండాలంగా ఉన్నాయని మండిపడ్డాడు. సొంత సంస్థ మహిళా ఉద్యోగులను అవమాన పరిచిన వాటర్స్‌ తరపున ఫాక్స్‌ న్యూస్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top