అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ విమానం కుప్పకూలి ఇద్దరు పిల్లలు సహా నలుగురు మరణించారు.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ విమానం కుప్పకూలి ఇద్దరు పిల్లలు సహా నలుగురు మరణించారు. ఈ ప్రమాదం కాలేజి స్టేషన్‌కు ఆగ్నేయంగా గల నవసోటాలో జరిగింది. నాలుగు సీట్లు మాత్రమే ఉన్న సింగిల్ ఇంజన్ సైరస్ ఎస్ఆర్-20 రకం విమానం సిటీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే ప్రయత్నాలలో ఉండగా అది కూలిపోయిందని సిన్హువా వార్తా సంస్థ తెలిపింది.
ఎయిర్ అఖ్తర్ సంస్థ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్న ఈ విమానం.. డేవిడ్ వేన్ హూక్స్ ఎయిర్‌పోర్టు నుంచి హ్యూస్టన్‌కు బయల్దేరింది. కానీ నవసోటా సమీపంలో ఓ విమానంలో వెళ్తున్న పైలట్.. ఈ విమానం కూలిపోయి ఉండటాన్ని గుర్తించాడు. అందులో నలుగురు ప్రయాణికులు మరణించిన విషయాన్ని పోలీసులు కూడా ధ్రువీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) విచారణ జరుపుతోంది.