ఫోర్బ్స్‌ లిస్ట్‌: రికార్డ్‌ స్థాయిలో మహిళలు | Forbes list: 255 women are included in this year rankings | Sakshi
Sakshi News home page

ఫోర్బ్స్‌ లిస్ట్‌: రికార్డ్‌ స్థాయిలో మహిళలు

Mar 6 2018 8:37 PM | Updated on Oct 4 2018 4:43 PM

Forbes list:  255 women are included in this year rankings - Sakshi

2018 సంవత్సరానికి ఫోర్బ్స్‌ ప్రకటించిన ప్రపంచ అతి సంపన్నుల జాబితా గొప్ప ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ఏడాది ఈ జాబితాలో  మహిళలు అదరగొట్టారని ఫోర్బ్స్ అసిస్టెంట్ మేనేజింగ్ ఎడిటర్ లూయిసా క్రోల్  ప్రకటించారు. రికార్డు స్థాయిలో 255 మంది మహిళలు ఈ సంవత్సరం  కొత్తగా ర్యాంకింగ్‌లో చేరారని తెలిపారు.  2018 జాబితాలో అరవై ఏడు శాతం  సెల్ప్‌ మేడ్‌  బిలియనీర్లుగా  ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా చైనాకు చెందిన మహిళా వ్యాపారవేత్త   సెల్ఫ్‌ మేడ్‌ బిలియనీర్‌  లిస్ట్‌లో  టాప్‌లో నిలిచారు.  ఇది చాలా ఉత్సాహకరమైన పరిణామమని క్రోల్‌ సంతోషం వ్యక్తం చేశారు.   

కొత్తగా ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్న 255 మందిలో 72మంది మహిళలు   తమకు తాముగా రాణించిన వ్యాపారవేత్తలుగా నిలిచారు.  చైనీస్ వ్యాపారవేత్త, లెన్స్‌ టెక్నాలజీ వ్యవస్థాపకురాలు, సీఈవో జౌ క్యున్‌ఫియా  (48) నికర సంపద   7.8 బిలియన్‌ డాలర్లతో  జాబితాలో ధనవంతురాలైన మహిళగా ఉన్నారు.  బాల్యంలోనే తల్లిని  కోల్పోయిన జౌ   చదువుకు స్వస్తి  చెప్పారు.  16 ఏళ్లవరకు ఒక ఫ్యా​క్టరీలో కార్మికురాలిగా పనిచేశారు. అనంతరం స్మార్ట్‌ఫోన్లలో వాడే టచ్‌ స్క్రీన్‌  తయారీ సంస్థను స్థాపించారని క్రోల్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement