ఒలికిపోయిన కాఫీ.. క్లీన్‌ చేసిన ప్రధాని! | Dutch Prime Minister Clean Floor After | Sakshi
Sakshi News home page

Jun 6 2018 11:38 AM | Updated on Jun 6 2018 4:08 PM

Dutch Prime Minister Clean Floor After  - Sakshi

నేలను శుభ్రం చేస్తున్న ప్రధాని మార్క్‌ రుట్టే

ఎడిన్‌బర్గ్‌‌: రాజకీయ నేతలంటేనే ఆర్భాటాలు, హంగులు, సేవలు చేయించుకోడానికి సిబ్బంది, సైగలతోనే శాసనాలు.. అబ్బో ఆ హంగామానే వేరు. అలాంటిది ఆయనో ప్రధాని. ఆ స్థాయి వ్యక్తి నుంచి అంత కంటే ఎక్కువ బిల్డప్పే ఆశించటం సహజం. కానీ, ఊహించని ఘటనతో డచ్‌(నెదర్లాండ్స్‌) ప్రధాని ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేశారు. కాఫీ కప్పు ఒలకబోసిన ఆయన.. తానే స్వయంగా అక్కడ శుభ్రం చేసి నెటిజన్ల మన్ననలు అందుకుంటున్నారు. 

నెదర్లాండ్స్‌ ప్రధాని మార్క్‌ రుట్టే ఓ చేతిలో ఫైళ్లతో.. మరో చేతిలో కాఫీ కప్పుతో పార్లమెంట్‌లోకి వెళ్తున్నారు. ఇంతలో సెక్యూరిటీ వద్ద ఉన్న మెషీన్‌ తగిలి ఆ కప్పు ఒలికిపోయింది. ఆ స్థానంలో వేరే వారు ఉంటే సిబ్బందితో శుభ్రపరిచేవారేమో. కానీ, రుట్టే మాత్రం మహిళా సిబ్బంది చేతిలోని తుడిచే కర్రను లాక్కుని సరదాగా ఆయనే శుభ్రం చేశారు. ఇంతలో అక్కడికి వచ్చిన క్లీనింగ్‌ స్టాఫ్‌ ఆయన నిలువరించే యత్నం చేసినప్పటికీ ఆయన వారి మాట వినలేదు. తాను చేసిన పొరపాటుకు.. తాను శుభ్రం చేయటం సరైందని ఆయన వారితో చెప్పటం విశేషం. దీంతో వారంతా ఆయన చుట్టూ చేరి పాట పాడుతూ ఆయన్ని ప్రొత్సహించారు. 

ఇక ఈ వీడియో వైరల్‌ అవ్వటం, లైకులు, షేర్లతో దూసుకుపోతుండగా.. కామెంట్లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. స్వచ్ఛ నెదర్లాండ్స్‌ అని, ఆ స్థానంలో మన నేతలు ఉంటే ఏం చేసేవారో అని ఒకరు... ఇప్పటి నుంచి భారతీయ నేతలు కూడా క్యూ కడతారేమోనని మరోకరు.. మార్క్‌ రుట్టేని చూసి మన నేతలు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఇంకొకరు... ఇలా అభిప్రాయపడుతున్నారు. వైరల్‌ అవుతున్న ఆ వీడియోను మీరూ చూడండి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement