
వాషింగ్టన్: పోలీసులు అనుసరిస్తున్న వివాదాస్పద చోక్‌హోల్డ్(అనుమానితులను మెడపై మోకాలితో నొక్కి ఉంచడం) విధానంపై అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. అనుమానితులను కట్టడి చేయడానికి పోలీసులు ఈ విధానం పాటించకుండా నిషేధం విధించాలనీ, అయితే, ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ విధానమే అవసరమవుతుందని వ్యాఖ్యానించారు. ఫాక్స్‌న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన..‘ఎవరైనా వ్యక్తి గొడవకు దిగినప్పుడు పోలీసు అధికారి అతనితో జాగ్రత్తగా ఉండాలి. చోక్‌హోల్డ్ పద్ధతి హాని చేయనిది, ఉత్తమమైంది. అయితే, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీస్తుంది’ అని ట్రంప్ తెలిపారు.
ఓడిపోతే ప్రశాంతంగా తప్పుకుంటా
వచ్చే నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైతే మనస్ఫూర్తిగా పదవి నుంచి తప్పు కోబోరంటూ వచ్చిన వార్తలు అబద్ధమని ట్రంప్ ఖండించారు. రెండోసారి తాను అధ్యక్ష పదవికి ఎన్నిక కాకుంటే దేశానికి నష్టమంటూ ఆయన వ్యాఖ్యానించారు.