పదోసారి తాత అయిన అమెరికా అధ్యక్షుడు | Donald Trump Becomes Grandfather For The Tenth Time | Sakshi
Sakshi News home page

పదోసారి తాత అయిన అమెరికా అధ్యక్షుడు

Aug 21 2019 8:12 AM | Updated on Aug 21 2019 8:16 AM

Donald Trump Becomes Grandfather For The Tenth Time - Sakshi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాత అయ్యారు. ఆయన కుమారుడు ఎరిక్‌ ట్రంప్‌ భార్య లారా సోమవారం రాత్రి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాత అయ్యారు. ఆయన కుమారుడు ఎరిక్‌ ట్రంప్‌ భార్య లారా సోమవారం రాత్రి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఎరిక్‌ ట్విటర్‌లో పంచుకున్నాడు. ‘ఈ ప్రపంచంలోకి కరోలినా డొరొతీ ట్రంప్‌ ను ఆహ్వానిస్తున్నాం’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. డొరోతితో కలుపుకుని డొనాల్డ్‌ ట్రంప్‌ మనవలు, మనవరాళ్ల సంఖ్య 10కి చేరింది. ఎరిక్‌కు ఇప్పటికే ఒక బాబు ఉన్నాడు. ముగ్గురు భార్యలున్న ట్రంప్‌నకు మొత్తం ఐదుగురు పిల్లలు. వారిలో పెద్దవాళ్లైన డొనాల్డ్‌ జూనియర్‌కు ఐదుగురు, ఇవాంకా ట్రంప్‌నకు ముగ్గురు పిల్లలు. ట్రంప్‌నకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలను ఎరిక్‌ చూసుకుంటారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement