వెన్నతో గుండెకు నష్టం లేదు | Sakshi
Sakshi News home page

వెన్నతో గుండెకు నష్టం లేదు

Published Fri, Jul 1 2016 2:26 AM

వెన్నతో గుండెకు నష్టం లేదు

వాషింగ్టన్ : వెన్న తినడం వల్ల గుండెకు వచ్చిన ప్రమాదమేమీ లేదని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. నిర్ణీత పరిమాణంలో వెన్నని తీసుకుంటే మధుమేహం నుంచి కూడా  తప్పించుకోవచ్చని టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. వెన్న తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు రావని పేర్కొన్నారు. మొత్తం 15 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించారు.

రోజుకు 14 గ్రాముల (ఒక టేబుల్ టీ స్పూన్) వెన్నను ఆహారంలో తీసుకోవచ్చని వివరించారు. మరీ ఎక్కువ  పరిమాణంలో వెన్న తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని పరిశోధకులు ల్యూరా పింపిన్ పేర్కొన్నారు. పిండిపదార్థాలు, చక్కెర, వంట నూనెల కన్నా వెన్న మేలని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement