'అమ్మాయి.. ఇకనైనా డేటింగ్కు గుడ్ బై చెప్పు' | Britney Spears's father urges her not to date | Sakshi
Sakshi News home page

'అమ్మాయి.. ఇకనైనా డేటింగ్కు గుడ్ బై చెప్పు'

Sep 6 2015 11:03 AM | Updated on Sep 3 2017 8:52 AM

'అమ్మాయి.. ఇకనైనా డేటింగ్కు గుడ్ బై చెప్పు'

'అమ్మాయి.. ఇకనైనా డేటింగ్కు గుడ్ బై చెప్పు'

డేటింగ్కు దూరంగా ఉండాలని అమెరికా పాప్ గాయని, నటి బ్రిట్నీ స్పియర్స్ను ఆమె తండ్రి మందలించారట.

లాస్ ఏంజిల్స్ : డేటింగ్కు దూరంగా ఉండాలని అమెరికా పాప్ గాయని, నటి బ్రిట్నీ స్పియర్స్ను ఆమె తండ్రి మందలించారట.  'పర్ఫ్యూమ్' హీరోయిన్ బ్రిట్నీ తన బాయ్ ఫ్రెండ్ చార్లీ ఎబెర్సాల్ నుంచి రెండు నెలల క్రితం విడిపోయింది. క్యాలెండర్లో నెలలు మారుతున్నట్లుగా బ్రిట్నీ బాయ్ ఫ్రెండ్స్ జాబితా కూడా ఎప్పటికప్పుడు మారుతుండటంతో ఆమె తండ్రి ఈ విషయంలో కాస్త సీరియస్గా ఉన్నారు. ఇక ఎవరితోనూ డేటింగ్ చేయవద్దంటూ పాప్ సింగర్ కు గట్టిగా చెప్పారు.

ప్రియుడు చార్లీ దూరంకావడంతో బ్రిట్నీ మానసికవేదనకు గురవుతుందని జేమీ స్పియర్స్ భావించాడు. దీంతో ఆమెలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి అతడు ప్రయత్నిస్తుండగా, మరో వ్యక్తి తన జీవితంలోకి వస్తే చార్లీని మరిచిపోగలనని తండ్రికి తేగేసి చెప్పిందట. ఈ విషయంలో తండ్రీ కూతుళ్ల మధ్య వాదులాట జరిగినట్టు మీడియా కథనం. కెల్విన్ ఫెదర్లైన్, జాసన్ అలెగ్జాండర్ ల నుంచి బ్రిట్నీ విడాకులు తీసుకున్న తర్వాత బాయ్ ఫ్రెండ్స్ ఆమెతో కాలక్షేపం చేసి చివరకు ఒంటరి దాన్ని చేస్తున్నారని జేమీ స్పియర్స్ఆవేదన చెందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement