భారత్పై ఐఎస్ఐఎస్ దాడులు జరిగే ప్రమాదం! | Britain warns India of possible terror attack by ISIS | Sakshi
Sakshi News home page

భారత్పై ఐఎస్ఐఎస్ దాడులు జరిగే ప్రమాదం!

Jan 19 2015 6:58 PM | Updated on Sep 2 2017 7:55 PM

భారత్పై ఐఎస్ఐఎస్ దాడులు జరిగే ప్రమాదం!

భారత్పై ఐఎస్ఐఎస్ దాడులు జరిగే ప్రమాదం!

భారతదేశంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ దాడులు చేసే ప్రమాదం స్పష్టంగా పొంచి ఉందని బ్రిటన్ హెచ్చరించింది.

భారతదేశంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ దాడులు చేసే ప్రమాదం స్పష్టంగా పొంచి ఉందని బ్రిటన్ హెచ్చరించింది. వెంటనే వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. లండన్లో ఈనెల 15, 16 తేదీల్లో జరిగిన ఇండో-యూకే కౌంటర్ టెర్రరిజం జాయింట్ వర్కింగ్ గ్రూపు సమావేశంలో భారత అధికారులకు బ్రిటిష్ అధికారులు ఈ వివరాలు చెప్పారు.

ఉగ్రవాదుల్లో మంచివాళ్లు, చెడ్డవాళ్లు అని ఎవరూ ఉండరన్న విషయాన్ని పాకిస్థాన్కు చెప్పాలని బ్రిటిష్ అధికారులను భారత్ కోరింది. ఇటీవల పెషావర్ స్కూలుపై కాల్పులు జరిగిన సంఘటన నేపథ్యంలోనైనా ఈ విషయం గుర్తెరగాలని సూచించింది. ఇన్నాళ్లుగా పాకిస్థాన్ ఉగ్రవాదులకు పుట్టినిల్లుగా ఎందుకు ఉందో అడగాలని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement