భారత్‌పై ఐఎస్ఐఎస్ దాడులు జరిగే ప్రమాదం!
భారతదేశంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ దాడులు చేసే ప్రమాదం స్పష్టంగా పొంచి ఉందని బ్రిటన్ హెచ్చరించింది. వెంటనే వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. లండన్‌లో ఈనెల 15, 16 తేదీల్లో జరిగిన ఇండో-యూకే కౌంటర్ టెర్రరిజం జాయింట్ వర్కింగ్ గ్రూపు సమావేశంలో భారత అధికారులకు బ్రిటిష్ అధికారులు ఈ వివరాలు చెప్పారు.
ఉగ్రవాదుల్లో మంచివాళ్లు, చెడ్డవాళ్లు అని ఎవరూ ఉండరన్న విషయాన్ని పాకిస్థాన్‌కు చెప్పాలని బ్రిటిష్ అధికారులను భారత్ కోరింది. ఇటీవల పెషావర్ స్కూలుపై కాల్పులు జరిగిన సంఘటన నేపథ్యంలోనైనా ఈ విషయం గుర్తెరగాలని సూచించింది. ఇన్నాళ్లుగా పాకిస్థాన్ ఉగ్రవాదులకు పుట్టినిల్లుగా ఎందుకు ఉందో అడగాలని తెలిపింది.