ఒబామాకు బిజినెస్ టైకూన్ సవాల్..! | Barack Obama Beats Richard Branson in Kitesurfing contest | Sakshi
Sakshi News home page

ఒబామాకు బిజినెస్ టైకూన్ సవాల్..!

Feb 8 2017 8:58 AM | Updated on Sep 5 2017 3:14 AM

ఒబామాకు బిజినెస్ టైకూన్ సవాల్..!

ఒబామాకు బిజినెస్ టైకూన్ సవాల్..!

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రముఖ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రన్సన్ ఓ సవాల్ విసిరారు.

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రముఖ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రన్సన్ ఓ సవాల్ విసిరారు. హవాయ్ లో సేదతీరుతున్న సందర్భంగా కైట్ సర్ఫింగ్‌లో తనతో పోటీపడి గెలవాలని ఒబామాను బ్రన్సన్ కోరారు. కైట్ సర్ఫింగ్‌తో పాటు ఫాయిల్ బోర్డింగ్ లలో పోటీ పడ్డారు. రిచర్డ్ కేవలం 50 మీటర్ల వరకు వెళ్లి నీళ్లల్లో పడిపోగా, ఒబామా దాదాపు 100 మీటర్ల వరకు వెళ్లి సవాల్ లో నెగ్గారని బ్రన్సన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఏది ఏమైతేనేం చివరికి ఈ గేమ్‌లో ఒబామానే విజయం సాధించారు.

 

వర్జిన్ గ్రూప్ అధినేత బ్రన్సన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఏకంగా 54వేలకు పైగా వ్యూస్, 10వేలకు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎక్కువగా సూట్‌లో అధికారులతో కనిపించే ఒబామా.. ప్రస్తుతం హాయిగా సేదతీరుతున్నారు. ఫ్యామిలీతో టూర్స్ ప్లాన్ చేస్తున్నారని ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లు కామెంట్ చేస్తున్నారు. అధ్యక్షుడిగా ఒబామాను చాలా మిస్సవుతున్నామని మరికొందరు తెగ బాధపడిపోతున్నట్లు పేర్కొన్నారు. గత నెలలో పదవీకాలం ముగియడంతో ఒబాబా అధ్యక్ష పీఠం నుంచి వైదొలగిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement