తోకచుక్కా.. ఏలియనా..!! | Astronomers spot the first ever 'alien' comet passing through our solar system | Sakshi
Sakshi News home page

తోకచుక్కా.. ఏలియనా..!!

Nov 19 2017 12:01 PM | Updated on Nov 20 2017 7:01 PM

Astronomers spot the first ever 'alien' comet passing through our solar system - Sakshi - Sakshi - Sakshi

వాషింగ్టన్‌ : మన సౌర కుటుంబంలో తోకచుక్కలు తిరుగుతుండటం సర్వసాధారణం. ఇవి ఎక్కువగా సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. భూమికి చేరువలో తిరుగడం మాత్రం తక్కువ సార్లు మాత్రమే జరుగుతుంటుంది. కానీ, మరో సౌర వ్యవస్థ నుంచి వచ్చి భూమి చుట్టూ తిరిగిన ఓ తోకచుక్క శాస్త్రవేత్తలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది.

ఈ ఘటన గత నెల 18వ తేదీన చోటు చేసుకుంది. ఆ తర్వాత వారం రోజుల్లో మరో 34 సార్లు అలా మన సౌర కుటుంబంలో తిరుగాడిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. హవాయిలోని టెలిస్కోప్‌ ఆ తోకచుక్కను గుర్తించినట్లు చెప్పారు. దానికి తోకచుక్క సీ/2017 అని పేరు పెట్టినట్లు వెల్లడించారు.

ఇలా ఓ తోకచుక్క ఇతర సౌర వ్యవస్థ నుంచి మన సౌర వ్యవస్థలోకి రావడం ఇదే తొలిసారని సైంటిస్టులు చెప్పారు. ఈ తోకచుక్కకు సంబంధించిన విషయాలను ‘ఇంటర్నేషనల్‌ యూనియన్స్‌ మైనర్‌ ప్లానెట్‌ సెంటర్‌’ ప్రచురించింది. ఇలాంటి సంఘటనల వల్ల ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదాలేవీ లేవని అభిప్రాయపడింది.

వేరే నక్షత్ర మండలం నుంచి వచ్చిన తోకచుక్క అని కొందరు అభిప్రాయపడుతున్నా.. మరికొందరు మాత్రం అది తోకచుక్క కాదని.. ఏలియన్‌ కావొచ్చని భావిస్తున్నారని చెప్పింది. వేరే నక్షత్ర విను వీధుల నుంచి వచ్చిన ఈ తోకచుక్క మధ్యలో జుపిటర్‌, మార్స్‌ల మీదుగా ప్రయాణించి ఉండొచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లారిడాకు చెందిన ప్లానెటరీ సైంటిస్ట్‌ డా. మారియా వొమాక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement