మేం చేసిన తప్పు మీరూ చేయకండి : ఆపిల్‌ సీఈవో

Apple Ceo Tim Cook says his generation failed on climate change - Sakshi

లూసియానా : సాంకేతికంగా మానవుడు ఎంతో అభివృద్ధి చెందుతున్నానని అనుకుంటున్నాడు. కానీ ఈ క్రమంలో పర్యావరణానికి జరుగుతోన్న నష్టాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నాడు. ఈ విషయంపై ఎంతో మంది ప్రముఖులు ఆందోళన చెందుతూనే ఉన్నారు. తాజాగా పర్యావరణ పరిరక్షణపై ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలో తులెన్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న టిమ్‌ కుక్‌.. యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘పర్యావరణా న్ని  పరిరక్షించడంలో మా తరం విఫలమైంది. మేమంతా కేవలం చర్చల పేరిట సమయాన్నంతా వృథా చేశాం. దీంతో మా తరంలో చర్చలు ఘనం, ఫలితాలు మాత్రం శూన్యం అన్నట్లుగా మారింది. మేం చేసిన తప్పు మీరు చేయకండి, ఈ తప్పు నుంచి గుణపాఠాన్ని నేర్చుకొని పర్యావరణ పరిరక్షణకు ముందడుగు వేయాల’ని కుక్‌ పిలుపునిచ్చారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top