వైఎస్సార్సీపీ కమిటీల్లో నియామకాలు | ysrcp telangana affiliated committee leaders appointed by ys jaganmohan reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ కమిటీల్లో నియామకాలు

Sep 7 2016 7:51 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్సీపీ కమిటీల్లో నియామకాలు - Sakshi

వైఎస్సార్సీపీ కమిటీల్లో నియామకాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వివిధ కమిటీల్లో నాయకులను నియమించింది.

హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వివిధ కమిటీల్లో పలువురి నాయకులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు జరిపినట్లు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డా.గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
 
రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా మేడేపల్లి శంకర్, కార్యదర్శులుగా చొక్కాల రాము, జాల మహేశ్ యాదవ్ నియమితులయ్యారు. రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఎం.వి.రమణ, నల్లగొండ జిల్లా ఎస్‌టీ సెల్ అధ్యక్షుడిగా పి. మేసయ్యనాయక్‌లను నియమించారు. 
 
పార్టీ రాష్ట్ర ప్రైవేట్ లెక్చరర్లు, టీచర్ల ఫోరం కమిటీ ప్రధాన కార్యదర్శిగా కొర్ర కిషన్‌నాయక్, సంయుక్త కార్యదర్శిగా రావూరి వినోద్‌కుమార్, సలహాదారుగా సంగం గోపాలస్వామి, ప్రచార కార్యదర్శులుగా ఎ. శ్రీనివాస్, రాపాక ప్రమోద్, కోశాధికారిగా ఉట్టలూర్ గోపాలచారి, ఆర్గనైజేషన్ కార్యదర్శిగా నూకల వెంకట్‌రెడ్డిలను నియమించారు. కొత్తగా నియమితులైన నాయకులకు గట్టు శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement