
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటం
రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వీటి పరిష్కారానికి పోరాటాలు చేయాల్సిన...
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం సమావేశంలో గట్టు శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వీటి పరిష్కారానికి పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థి వ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తం గా విద్యార్థులు సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కె.విశ్వనాథాచారికి శ్రీకాంత్‌రెడ్డి నియామకపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పేద విద్యార్థులు ఉన్నత చదవులు అభ్యసించాలని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశించారని, ఎన్నో కష్టనష్టాలకోర్చి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విజయవంతంగా అమలు చేశారని గుర్తుచేశారు.
కానీ ఆ తర్వాత వచ్చిన పాలకులు రీయిం బర్స్‌మెంట్‌కి తూట్లు పొడిచారన్నారు. వివిధ పరీక్షలను నిర్వహించటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అందుబాటులో ఉన్న ఉన్నత, సాంకేతిక విద్యను నేటి పాలకులు అందని ద్రాక్ష చేశారన్నారు. విశ్వనాథాచారి మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయాల సాధనకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో కృషి చేస్తానన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాడతామన్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ర్యాలీగా వచ్చిన విద్యార్థులు కార్యాలయం వద్ద పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు నల్లా సూర్యప్రకాశ్, రెహమాన్, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, కె.శివకుమార్, కొండా రాఘవరెడ్డి, విద్యార్థి నాయకులు నవీన్‌కుమార్, ఉదయ్‌రెడ్డి, కిరణ్‌బాబు, హనుమంతరెడ్డి, రంజిత్, జగదీశ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.