నగరంలోని పాతబస్తీలో ఓ యువకుడు ఎయిర్‌గన్‌తో హల్‌చల్ సృష్టించాడు.
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఓ యువకుడు ఎయిర్‌గన్‌తో హల్‌చల్ సృష్టించాడు. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్‌పేట సమీపంలో ఇంజనీరింగ్ విద్యార్థి హేమంత్‌రెడ్డి శుక్రవారం అర్ధరాత్రి ఎయిర్‌గన్‌తో పలువురిని బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఎయిర్‌గన్‌తో పాటు 12 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.