జూబ్లీహిల్స్‌ క్లబ్‌పై యువకుల వీరంగం | Youngster attack on Jubilee hills club at Jubliee hills | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌ క్లబ్‌పై యువకుల వీరంగం

Sep 29 2016 6:34 AM | Updated on Sep 4 2017 3:24 PM

జూబ్లీహిల్స్‌ క్లబ్‌పై యువకుల వీరంగం

జూబ్లీహిల్స్‌ క్లబ్‌పై యువకుల వీరంగం

నగరంలోని జూబ్లీహిల్స్‌ క్లబ్పై బుధవారం అర్ధరాత్రి కొందరు యువకులు వీరంగం సృష్టించారు.

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌ క్లబ్పై బుధవారం అర్ధరాత్రి కొందరు యువకులు వీరంగం సృష్టించారు. క్లబ్‌ బంద్‌ చేయడంతో ఆగ్రహించిన యువకులు క్లబ్‌ సిబ్బందిపై దాడి చేశారు. క్లబ్‌ సమయం ముగిసిందని అక్కడి సిబ్బంది నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. వినిపించుకోని యవకులు మద్యం మత్తులో విచక్షణ లేకుండా దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో ఐదుగురికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. దాడికి పాల్పడిన యువకులపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగినట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement