రెండు ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Nov 26 2016 12:21 PM | Updated on Aug 30 2018 4:07 PM
హైదరాబాద్: రెండు ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని కేపీహెచ్‌బీ ప్రగతినగర్ చెరువుకట్టపై శనివారం చోటు చేసుకుంది. అడ్డగుట్టకు చెందిన రాజు(24) తన స్నేహితుడితో కలిసి బైక్ పై వెళ్తుండగా.. మరో బైక్ వీరిని ఢీకొట్టింది. దీంతో రాజు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
Advertisement
Advertisement