
ఓ బిగ్ న్యూస్ పై కేటీఆర్ సస్పెన్స్
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఐటీ శాఖమంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ తనయుడు మంగళవారం ఆసక్తికరమైన ట్విట్ చేశారు.
హైదరాబాద్ : సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఐటీ శాఖమంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ తనయుడు మంగళవారం ఆసక్తికరమైన ట్విట్ చేశారు. ఈ నెల 19న మీతో ఒక పెద్ద వార్తను పంచుకోబోతున్నాను అంటూ ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. అప్పటివరకూ అదేంటో సస్పెన్స్ అంటూ ...ఉత్కంఠకు తెర తీశారు. ఇందుకు కేసీఆర్ చెప్పే ఆ వార్త ఏంటా అని దానిపై చర్చలు అప్పుడే మొదలయ్యాయి. ఆ వార్త ఏంటో అనే దానిపై ఎదురు చూస్తున్నారు.
మరోవైపు కేటీఆర్ ట్విట్పై స్పందనలు కూడా వస్తున్నాయి. ఆ రోజు రెండు విశేషాలు ఉన్నాయి మరి. ఒకటి యాపిల్ సీఈవో టీమ్ కుక్ బృందం హైదరాబాద్లో పర్యటించడం. మరొకటి ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ఫలితం కూడా అదే రోజు వెల్లడి కానున్న నేపథ్యంలో ఉప ఎన్నిక ఫలితాన్నే కేటీఆర్ వెల్లడిస్తారా లేదా మరొకటా అనే చర్చించుకుంటున్నారు. ఇంతకీ కేటీఆర్ చెప్పే బిగ్ న్యూస్ ఏంటో తెలియాలంటే 19వ తేదీ వరకూ ఆగాల్సిందే.
Will share a Big news with you all day after tomorrow. Suspense till then
— KTR (@KTRTRS) 17 May 2016