కుటుంబంలో గొడవల కారణంగా భార్య, అత్తపై అల్లుడు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.
భార్య, అత్తపై అల్లుడి హత్యాయత్నం
Nov 22 2016 11:26 PM | Updated on Sep 4 2017 8:49 PM
భాగ్యనగర్‌కాలనీ: కుటుంబంలో గొడవల కారణంగా భార్య, అత్తపై అల్లుడు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై గోపి వివరాల ప్రకారం రహ్మత్‌నగర్‌కు చెందిన మహబూబ్, ఆస్మా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మూడు నెలల క్రితం భర్తతో గొడవపడిన ఆస్మా పుట్టింటికి వచ్చింది.దీంతో మహబూబ్ ఆమెకు ఫోన్‌చేసి తరచూ బెదిరింపులకు పాల్పడేవాడు.
సోమవారం ఎరగ్రడ్డలో కత్తి కొనుగోలు చేసి హబీబ్‌నగర్‌లోని అత్త ఇంటికి వచ్చిన అతను భార్యపై దాడి చేసేందుకు యత్నించాడు.ఇంటి ముందుకు ఉన్న ఆస్మా తల్లి రజియాపై దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో అస్మా కూడా గాయపడింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement