ప్రతిభ గల పేద విద్యార్థులను చదివిస్తాం | We will provide study to poor students who are talented | Sakshi
Sakshi News home page

ప్రతిభ గల పేద విద్యార్థులను చదివిస్తాం

Apr 24 2017 2:32 AM | Updated on Sep 5 2017 9:31 AM

ఓయూ శతాబ్ది ఉత్సవాలను పురస్క రించుకొని ప్రతిభ గల పేద విద్యార్థులను చదివి స్తామని ఓయూ జాతీయ పూర్వవిద్యార్థుల ఫోరం ఛైర్మన్‌ పాపారావు పేర్కొన్నారు.

ఓయూ పూర్వవిద్యార్థుల ఫోరం

హైదరాబాద్‌: ఓయూ శతాబ్ది ఉత్సవాలను పురస్క రించుకొని ప్రతిభ గల పేద విద్యార్థులను చదివి స్తామని ఓయూ జాతీయ పూర్వవిద్యార్థుల ఫోరం ఛైర్మన్‌ పాపారావు పేర్కొన్నారు. ఆదివారం ఉస్మానియా వర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రతిభగల పేద విద్యార్థులను గుర్తించి ఓయూ జాతీయ పూర్వవిద్యార్థుల ఫోరం తరఫున చదివి స్తామన్నారు. ఉత్సవాల ముగింపునకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తామన్నారు.

ఉత్సవాల సందర్భంగా మూడురోజులపాటు ఓయూ జాతీయ పూర్వవిద్యార్థుల ఫోరం ఆధ్వర్యంలో ఉచిత సేవలు అందించనున్నట్లు చైర్మన్‌ పాపారావు తెలిపారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు హాజరయ్యే వారికి కలిగే సందేహాలు, ఇతర వివరాలకు 9490747967, 9348812123, 9848125732 నంబర్లకు ఫోన్‌ చేసి తెలుసు కోవచ్చని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement