బంజారాహిల్స్‌లో విద్యుత్ అంతరాయం | vidyut problem of saturday in banjara hills | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో విద్యుత్ అంతరాయం

Jun 12 2015 5:24 PM | Updated on Sep 3 2017 3:38 AM

దేవరకొండ బస్తీ ఫీడర్‌కు జరుగుతున్న మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ అంతరాయం కలిగే అవకాశం ఉంది.

బంజారాహిల్స్ (హైదరాబాద్): దేవరకొండ బస్తీ ఫీడర్‌కు జరుగుతున్న మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యూసుఫ్‌గూడ పోలీస్‌లైన్స్, యాదగిరినగర్, ఎల్.ఎన్.నగర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, శ్రీకృష్ణానగర్, కోట్ల విజయభాస్కర్ స్టేడియం, బంజారాహిల్స్ రోడ్ నెం. 3, 4, 5, వెంగళరావునగర్ పార్కు, దేవరకొండ బస్తీ, నాగార్జున నగర్, ఎల్లారెడ్డిగూడ, అమీర్‌పేట మెయిన్‌రోడ్, సితారహోటల్, ఇమేజ్ హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుంది.

అదే విధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగర్ సోసైటీ, కమలాపురికాలనీ ఫేజ్ 3, ఆరోరా కాలనీ, సత్యసాయి నిగమాగమం, గణపతి కాంప్లెక్స్,  ఎమ్మెల్యే కాలనీ,  వెంకటగిరి వాటర్‌వర్క్స్ ఏరియాల్లో కరెంటు సరఫరా నిలిచిపోతుందని ఏడీఈ కె. భాస్కర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement