శిరీష మరణం వెనక మిస్టరీ లేదు | There is no mystery behind the death of Sirisha | Sakshi
Sakshi News home page

శిరీష మరణం వెనక మిస్టరీ లేదు

Jun 18 2017 1:19 AM | Updated on Sep 2 2018 3:42 PM

శిరీష మరణం వెనక మిస్టరీ లేదు - Sakshi

శిరీష మరణం వెనక మిస్టరీ లేదు

బ్యూటీషియన్‌ శిరీష ఆత్మహత్య చేసుకుందని, ఆమె మరణం వెనుక మరే మిస్టరీ లేదని పోలీస్‌ ఉన్నతాధికారులు మరోసారి స్పష్టం చేశారు.

- పోలీసు ఉన్నతాధికారుల పునరుద్ఘాటన
సందేహాలను ఆధారాలతో నివృత్తి చేయాలని నిర్ణయం
 
సాక్షి, హైదరాబాద్‌: బ్యూటీషియన్‌ శిరీష ఆత్మహత్య చేసుకుందని, ఆమె మరణం వెనుక మరే మిస్టరీ లేదని పోలీస్‌ ఉన్నతాధికారులు మరోసారి స్పష్టం చేశారు. కటుంబసభ్యుల సందేహాలను శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో నివృత్తి చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఆమెది హత్య అని నిర్ధారించేందుకు ఎవరు, ఏ ఆధారం సమర్పించినా పరిగణనలోకి తీసుకోనున్నారు. శిరీష ఆరడుగుల ఎత్తు, 80 కిలోల బరువు ఉందని, అంత బరువును సీలింగ్‌ ఫ్యాన్‌ రాడ్‌ ఎలా ఆపుతుందన్న బంధువుల సందేహంపై అధికారులు స్పందిస్తూ.. శిరీష 5.6 అడుగుల ఎత్తు, 65–70 కిలోల బరువు ఉంటుందని, చనిపోవాలన్న ఉద్దేశ్యంతోనే ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కాళ్లను ముడుచుకుందని, సీలింగ్‌ ఫ్యాన్‌ వంద కిలోల బరువునైనా ఆపగలదని నిర్ధారించారు.  

కుకునూరుపల్లి నుండి తిరిగివచ్చే సమయంలో అరవడం.. కారు నుండి దూకే ప్రయత్నం చేయడంతో కారులో రాజీవ్, శ్రవణ్‌ ఆమెపై పలుమార్లు దాడి చేయటం వల్లే ఒంటిపై గాయాల య్యాయని పేర్కొన్నారు. బయటే హత్య చేసి తీసుకువచ్చారన్న ఆరోపణపై స్పందిస్తూ.. ఫిల్మ్‌నగర్‌లోని స్టూడియోకు చేరుకున్నాక శిరీష స్వయంగా 3.47 గంటల సమయంలో తన వేలిముద్ర(బయోమెట్రిక్‌)ను ఉపయోగించి డోర్‌ తెరిచిందని, తిరిగి 3.54 గం టలకు తన ఫోన్‌తో రాజీవ్‌కు వీడియోకాల్‌ చేసిన ఆధారాలను చూపు తున్నారు.  శిరీష ఆత్మ హత్య చేసుకున్న ప్రవేశాన్ని ఐదుగురు ఫోరెన్సిక్‌ నిపు ణులు సందర్శించి, అన్ని కోణాల్లో పరిశీలించారని తెలిపారు. ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి కూడా బంజారాహిల్స్‌ ఎస్సై హరీందర్‌కు 9 మార్లు కాల్‌ చేసి వాకబు చేశారన్నారు.
 
చంచల్‌గూడ జైలుకు రాజీవ్, శ్రవణ్‌
కాగా, శిరీష కేసులో నిందితులుగా ఉన్న రాజీవ్, శ్రవణ్‌ను కోర్టు ఉత్తర్వుల మేరకు శనివారం పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. శని వారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీ క్షల అనంతరం రాజీవ్, శ్రవణ్‌లను బంజారా హిల్స్‌ పోలీసులు నాంపల్లిలోని మూడో అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరి చారు. వీరిద్దరికి న్యాయమూర్తి రెండు వారాల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ తీర్పునిచ్చారు.  శ్రవణ్, రాజీవ్‌లను కస్టడీకి కోరుతూ బంజారా హిల్స్‌ పోలీసులు కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేయనున్నట్టు సమాచారం. శిరీషపై   ప్రభాకర్‌రెడ్డి అత్యాచారయత్నం చేశాడని నింది తులు ఇచ్చిన సమాచారం మేరకు శిరీష లోదుస్తుల తోపాటు ఆ రోజు ఆమె ధరించిన డ్రెస్సును, ప్రభాకర్‌రెడ్డి లోదుస్తులను కూడా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement