యువతితో అసభ్య ప్రవర్తన, యువకుడి అరెస్టు | the young man arrested for Dirty behavior with a woman | Sakshi
Sakshi News home page

యువతితో అసభ్య ప్రవర్తన, యువకుడి అరెస్టు

Jul 19 2016 6:30 PM | Updated on Aug 20 2018 4:44 PM

పేమించిన తనను కాకుండా వేరొకరితో పెళ్లికి సిద్ధమవుతావా అంటూ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు నిర్భయ కేసు పెట్టి రిమాండ్‌కు పంపారు.

పేమించిన తనను కాకుండా వేరొకరితో పెళ్లికి సిద్ధమవుతావా అంటూ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు నిర్భయ కేసు పెట్టి రిమాండ్‌కు పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకసవరం గ్రామానికి చెందిన కాకి ఉమామహేశ్వర్‌రావు(27) అలియాస్ మహేష్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ -43లో తన తండ్రి వాచ్‌మెన్‌గా పనిచేసే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు.

ఎంసీఏ చదువుతున్న మహేష్ కొంత కాలం నుంచి ఆ పక్కనే ఉన్న భవనం వాచ్‌మెన్ కూతురు సరితతో ప్రేమలో పడ్డాడు. ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ లీగ్‌లో కూడా ఆడాడు. మంచి భవిష్యత్తు ఉన్న మహేష్ ప్రేమ మైకంలో క్రికెట్‌ను నిర్లక్ష్యం చేసి ఆవారాగా తిరగసాగాడు. ఈ నేపథ్యంలోనే సరిత పెద్దలు కుదుర్చిన యువకుడితో పెళ్లికి అంగీకరించింది. ఇది జీర్ణించుకోలేని మహేష్ రెండు రోజుల క్రితం యువతి సరిత జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-10లో నడిచి వెళ్తుండగా మహేష్ ఆమెను అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు గుమిగూడి మహేష్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు మహేష్‌పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement