తెలంగాణలో భారీగా చేపల పెంపకం: కేసీఆర్ | Telangana government plans to implement hugh fish farming | Sakshi
Sakshi News home page

తెలంగాణలో భారీగా చేపల పెంపకం: కేసీఆర్

Sep 30 2016 7:55 PM | Updated on Aug 15 2018 9:35 PM

తెలంగాణలో చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

హైదరాబాద్ : తెలంగాణలో చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రూ.48 కోట్లతో 4,533 చెరువుల్లో చేపలు పెంచనున్నట్లు ఆయన శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. అక్టోబర్ 3 నుంచి చేపల పెంపకం కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులంతా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని ఆయన సూచించారు. కాగా మత్స్యసందప పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులను కేటాయించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ప్రస్తుతం 781.30 హెక్టార్లలోనే చేపల పెంపకం జరుగుతున్నది.
 

Advertisement
 
Advertisement
Advertisement