'20 నెలలైనా ఒక్క హామీ అమలు చేయలేదు' | Sujay krishna ranga rao takes on chandrababu | Sakshi
Sakshi News home page

'20 నెలలైనా ఒక్క హామీ అమలు చేయలేదు'

Mar 10 2016 9:28 AM | Updated on Jul 28 2018 3:23 PM

'20 నెలలైనా ఒక్క హామీ అమలు చేయలేదు' - Sakshi

'20 నెలలైనా ఒక్క హామీ అమలు చేయలేదు'

అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఎన్నికల హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని టీడీపీ ప్రభుత్వంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు మండిపడ్డారు.

హైదరాబాద్ : అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఎన్నికల హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని టీడీపీ ప్రభుత్వంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు మండిపడ్డారు. గురువారం హైదరాబాద్లో అసెంబ్లీ కార్యదర్శికి చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాసం నోటీసును వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అందజేశారు.

అనంతరం సుజయకృష్ణ రంగారావు విలేకర్లతో మాట్లాడుతూ... చంద్రబాబుపైన, ఈ ప్రభుత్వంపైన ప్రజలు విశ్వాసం కోల్పోయారని ఆరోపించారు. పేద రైతుల నుంచి టీడీపీ నేతలు రాజధాని ప్రాంతంలో భూములు కొట్టేశారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వ వైపల్యాలపై విపులంగా మాట్లాడేందుకే అవిశ్వాసం పెట్టినట్లు సుజయ్ కృష్ణరంగారావు స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement