‘శివారు’లో భారీ వాహనాలపై ఆంక్షలు | 'Suburban' restrictions on heavy vehicles in | Sakshi
Sakshi News home page

‘శివారు’లో భారీ వాహనాలపై ఆంక్షలు

Nov 25 2013 3:45 AM | Updated on Aug 30 2018 3:56 PM

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీ వాహనాలపై డిసెంబర్ ఒకటి నుంచి ఆంక్షలు విధించనున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీ వాహనాలపై డిసెంబర్ ఒకటి నుంచి ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వాహనాలపై జరిమానా విధింపు, వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం తదితర చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.

శివారు ప్రాంతాలు రోజురోజుకూ విస్తరించడంతో పాటు వ్యాపార, విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు తదితర వాణిజ్య సంస్థలు కోకొల్లలుగా వెలియడంతో రహదారులపై ట్రాఫిక్ పెరిగింది. ఫలితంగా ట్రాఫిక్ రద్దీకి తోడు ప్రమాదాల సంఖ్య కూడా పెరిగింది. ఈ ప్రమాదాలకు కారణాలను అన్వేషించగా భారీ వాహనాల వల్ల ట్రాఫిక్ జామ్‌తో పాటు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తేలింది. దీంతో భారీ వాహనాల (లారీ, లారీటిప్పర్, రెడీమిక్సింగ్ ట్రాక్, కంటైనర్, బోర్‌వెల్ మెషిన్, జేసీబీ, డీసీఎంలు, వాటర్ ట్యాంకర్లు, ట్రాక్టర్లు)పై ఆంక్షలు విధించినట్లు కమిషనర్ ప్రకటించారు.

వీటిప్రకారం భారీ వాహనాలు ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి రాత్రి 11.00 నుంచి ఉదయం 7 గంటల వరకు కింద సూచించిన రహదారుల గుండా మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇతర సమయంలో వెళితే జరిమానా విధించడం లేదా  వాహనం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. మరికొన్ని ప్రాంతాలలో 24 గంటలు వెళ్లేలా మార్గాలను సూచించారు.
 
 నిర్ణీత వేళల్లో భారీ వాహనాలను అనుమతించిన మార్గాలివీ...
 =నారాయణ మ్మ కళాశాల నుంచి నలగండ్ల జంక్షన్‌కు వెళ్లే భారీ వాహనాలు ఖాజాగూడ జంక్షన్, గచ్చిబౌలి, ఐఐఐటీ జంక్షన్‌ల మీదుగా వెళ్లాలి.
 =ఖాజాగూడ జంక్షన్ నుంచి గచ్చిబౌలి వెళ్లే వాహనాలు నానక్‌రామ్‌గూడ రోటరీ మీదుగా వెళ్లాలి.
 =ఐసీఐసీఐ బ్యాంకు జంక్షన్ నుంచి ఐఐఐటీ జంక్షన్ వరకు.
 =చందానగర్ నాలా - హఫీజ్‌పేట జంక్షన్- మియాపూర్- మూసాపేట జంక్షన్- భరత్‌నగర్ -ఎర్రగడ్డ
 =మియాపూర్ జంక్షన్ నుంచి బీకే ఎన్‌క్లేవ్, హెచ్‌ఎంటీ మక్తా గ్రాగం వరకు
 =బహదూర్‌పల్లి టి జంక్షన్- సూరారం-షాపూర్‌నగర్-గుడెన్‌మెంట్-నర్సాపూర్ జంక్షన్
 =బాలనగర్ టి జంక్షన్ - ఫతేనగర్ ఫ్లైవర్ - లైట్ సన్ కేఫ్- బల్కంపేట
 =హబ్సిగూడ నుంచి నాచారం జంక్షన్ వరకు
 =ఉప్పల్ జంక్షన్ నుంచి రామంతాపూర్ వరకు
 =ఉప్పల్ జంక్షన్ నుంచి ఫిర్జాదీగూడ కమాన్ వరకు
 =ఉప్పల్ జంక్షన్-  కామినేని ఆసుపత్రి-ఎల్బీనగర్- బైరామల్‌గూడ- మందమల్లమ్మ - లక్ష్మీగార్డెన్
 =బైరామల్‌గూడ- సాగర్ రింగ్‌రోడ్డు- హస్తినాపూర్- బీయన్‌రెడ్డినగర్
 =ఎల్బీనగర్ జంక్షన్- హుడా కాంప్లెక్స్- వీవీనగర్ - దిల్‌సుఖ్‌నగర్
 =బైరామల్‌గూడ - కర్మన్‌ఘాట్ - గ్రీన్‌పార్క్ కాలనీ
 =బైరామల్‌గూడ -సాగర్‌రింగ్‌రోడ్డు- చింతల్‌కుంట చెక్‌పోస్టు
 =ఎల్బీనగర్ జంక్షన్-చింతల్‌కుంట- పనామా- సుష్మా థియేటర్
 =అత్తాపూర్ -ఉప్పరపల్లి- ఇంద్రారెడ్డి విగ్రహం- శివరాంపల్లి-అరాంఘర్
 
 ఈ రహదారులపై 24 గంటలూ వెళ్లొచ్చు...
 =హయత్‌నగర్ - కుంట్లూర్-రాజీవ్ గృహకల్ప-గౌరెల్లి- సద్దుపల్లి
 =అబ్దుల్లాపూర్‌మెట్-కవాడిపల్లి-తారామతిపేట్- సద్దుపల్లి
 =మల్లాపూర్-యన్‌ఎఫ్‌సీ- ఈసీఐఎల్ చౌరస్తా-చక్రిపురం-రాంపల్లి-ఘట్‌కేసర్
 =ఘట్‌కేసర్ నుంచి కీసర వరకు
 =ఘట్‌కేసర్ నుంచి నాగారం వరకు
 =ఘట్‌కేసర్ నుంచి వరంగల్‌రోడ్డు వరకు
 =శామీర్‌పేట్-దొంగలమైసమ్మ- తిమ్మాయిపల్లి- యాదగిరిపల్లి జంక్షన్-కీసర-బోగారం-కొండాపూర్- ఘట్‌కేసర్
 =పిసల్‌బండ- కంచన్‌బాగ్-బాలాపూర్ చౌరస్తా
 =బాలాపూర్ -మీర్‌పేట-నాగార్జునా హిల్స్-బీడీరెడ్డి గార్డెన్- బడంగ్‌పేట
 =నల్లగండ్ల జంక్షన్-కనుకుంట- లింగంపల్లి రైతు బజార్
 =గౌలిదొడ్డి -గోపన్‌పల్లి తండ- నల్లగండ్ల జంక్షన్
 =చర్చి ఘాజిల్లాపూర్- దిండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ-బహదూర్‌పల్లి టి జంక్షన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement