నిజాం కళాశాలలో విద్యార్థుల ఘర్షణ | students clash in Nizam College | Sakshi
Sakshi News home page

నిజాం కళాశాలలో విద్యార్థుల ఘర్షణ

Sep 8 2016 6:19 PM | Updated on Sep 4 2018 5:24 PM

నిజాం కళాశాలలో గురువారం మధ్యాహ్నం విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

నిజాం కళాశాలలో గురువారం మధ్యాహ్నం విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సయ్యద్ రెహ్మాన్ చాంబర్ వద్ద ఇరు వర్గాల విద్యార్థులు ఘర్షణకు దిగారు. గిరిజన విద్యార్ధులపై దాడులకు పాల్పడిన తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం పలు విద్యార్ధి సంఘాల నాయకులు ప్రిన్సిపల్ చాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగాఏబీవీపీ నిజాం కళాశాల యూనిట్ అధ్యక్షులు బంగ్ల చైతన్య, పీడీఎస్‌యూ నేత ఆనంద్ తదితరులు మాట్లాడారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు కనక లింగేశ్వర్ అగ్రవర్ణ అహంకారంతో దళితులపై దాడులకు పాల్పడడం దారుణమన్నారు. కళాశాలకు సంబంధం లేని బయటి వ్యక్తులు ప్రిన్సిపల్ ఎదుటే సహచర విద్యార్ధులపై దాడులకు పాల్పడుతుండడం కళాశాలలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థమైతోందని అన్నారు.  కాగా, పలు విద్యార్ధి సంఘాల నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కనక లింగేశ్వర్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement