ధర్నాకు సిద్ధమవుతున్న విద్యార్థులు అరెస్ట్ | students arrested in indira park | Sakshi
Sakshi News home page

ధర్నాకు సిద్ధమవుతున్న విద్యార్థులు అరెస్ట్

Jul 29 2016 12:09 PM | Updated on Nov 9 2018 4:10 PM

ఎంసెట్-2 పేపర్ లీకేజీ విషయంలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకేజీ విషయంలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ భవిష్యత్తుతో ఆడుకోవద్దని ప్రభుత్వానికి చెప్పడానికి వచ్చిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సచివాలయం వద్ద ఎంసెట్-2 బాధిత విద్యార్థుల తాకిడి అధికమైంది.

తల్లిదండ్రులతో కలిసి నిరసన తెలపడానికి సచివాలయం వద్దకు వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి బలవంతంగా పంపించి వేశారు. పోలీసుల చర్యలను విద్యార్థులు ఆగ్రహించారు.  తమ గోడు ప్రభుత్వానికి తెలియజెప్పడానికి ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు సిద్ధమవుతుండగా.. వారిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement