టికెట్ లేని ప్రయాణికులకు 1.7 లక్షల జరిమానా | South Central Railway gets Rs 1.7 Lakh From Ticketless Travellers | Sakshi
Sakshi News home page

టికెట్ లేని ప్రయాణికులకు 1.7 లక్షల జరిమానా

Nov 1 2013 9:48 AM | Updated on Oct 2 2018 4:31 PM

టికెట్లు లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న 480 మంది ప్రయాణికుల నుంచి 1.7 లక్షల రూపాయలను అపరాధ రుసుంగా వసూలు చేశారు.

టికెట్లు లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న 480 మంది ప్రయాణికుల నుంచి రైల్వే అధికారులు 1.7 లక్షల రూపాయలను అపరాధ రుసుంగా వసూలు చేశారు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి కె.సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. కాచిగూడ రైల్వే స్టేషన్లో దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ రాకేష్ అరోన్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి.

ఈ సందర్భంగా మొత్తం స్టేషన్ను తమ అదుపులోకి తసీఉకుని, బయటకు వెళ్లే మార్గాలన్నింటినీ భద్రతా సిబ్బంది మూసేశారు. టికెట్లు లేని, అక్రమ ప్రయాణాలకు సంబంధించి 410 కేసులు, బుక్ చేయని లగేజికి సంబంధించి 65 కేసులు, రైల్వే ప్రాంగణాల్లో చెత్త వేసినందుకు 8 కేసులు నమోదుచేశారు. మొత్తం అందరి నుంచి జరిమానాగా 1.70 లక్షల రూపాయలు వసూలు చేశారు.

ఈ తనిఖీలలో 36 మంది టికెట్ చెకింగ్ సిబ్బంది, 15 మంది ఆర్పీఎఫ్ సిబ్బంది, 15 మంది జీఆర్పీ సిబ్బంది, 14 మంది స్కౌట్లు, గైడ్లు పాల్గొన్నారు. మొత్తం 10 ఎక్స్ప్రెస్ రైళ్లు,  16 ప్యాసింజర్ రైళ్లు, 81 డెము, డీహెచ్ఎంయు, ఎంఎంటీఎస్ రైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement