భూస్కాంలో కాంగ్రెస్‌ నేతలెవరో తేల్చాలి | Shabir Ali on Miyapur land scam | Sakshi
Sakshi News home page

భూస్కాంలో కాంగ్రెస్‌ నేతలెవరో తేల్చాలి

Jun 17 2017 2:00 AM | Updated on Sep 5 2017 1:47 PM

భూస్కాంలో కాంగ్రెస్‌ నేతలెవరో తేల్చాలి

భూస్కాంలో కాంగ్రెస్‌ నేతలెవరో తేల్చాలి

మియాపూర్‌ భూములతో పాటు కాంగ్రెస్‌ నేతలు ఎక్కడెక్కడ భూ కుంభకోణాలకు పాల్పడ్డారో తేల్చాలని మండలిలో

హరీశ్‌కు షబ్బీర్‌ సవాల్‌
సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ భూములతో పాటు కాంగ్రెస్‌ నేతలు ఎక్కడెక్కడ భూ కుంభకోణాలకు పాల్పడ్డారో తేల్చాలని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ సవాల్‌ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, భూకుంభకోణంలో కాంగ్రెస్‌ నేతల హస్తముందని హరీశ్‌ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని, కుంభకోణంలో కాంగ్రెస్‌తోపాటు ఏ పార్టీ నేతలున్నా పేర్లు బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రతీదానికి కాంగ్రెస్‌ను నిందించడం టీఆర్‌ఎస్‌ నేతలకు, మంత్రులకు అలవాటైందని మండిపడ్డారు.

మియాపూర్‌ భూ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, సీబీఐ విచారణ చేస్తే అన్ని ఆధారాలను అందిస్తామని తెలిపారు. భూముల పరిరక్షణ కోసం, నకిలీ విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి సెక్షన్లు మార్చితే సరిపోదని, ప్రత్యేకంగా అసెంబ్లీలో చట్టాన్ని పెట్టాలని సూచించారు.  కేటీఆర్‌ అధికార అహంకారంతో నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండలిలో కాంగ్రెస్‌ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement