హైదరాబాద్లో ఇంటింటి సర్వే: సీపీ | Samagra Criminals Survey to be Held in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో ఇంటింటి సర్వే: సీపీ

Nov 4 2015 12:03 PM | Updated on Sep 4 2018 5:07 PM

నగరంలోని పాత నేరస్థులపై పోలీసులతో సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్ : నగరంలోని పాత నేరస్థులపై పోలీసులతో సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో మహేందర్రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...2011 నుంచి పాత నేరస్థులకు చెందిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు.

మొత్తం 11,500 మంది పాత నేరస్థులున్నారని చెప్పారు. అలాగే హైదరాబాద్లోనే 7500 మంది పాత నేరస్థులు ఉన్నారని తెలిపారు. పాత నేరస్థుల వివరాల సేకరణ కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తామన్నారు. నేరాలు అరికట్టేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని మహేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement