
బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఉద్యమించేందుకైనా సిద్ధమని తెలుగుదేశం ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.
బీసీ క్రీమిలేయర్ రద్దుకు ఉద్యమం: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఉద్యమించేందుకైనా సిద్ధమని తెలుగుదేశం ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించేందుకు పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో జరిగిన రాష్ట్ర బీసీ టీచర్ల సంఘం సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లలో ప్రమోషన్లు కల్పించకపోవడం ప్రభుత్వాల వివక్షకు నిదర్శనమన్నారు.
ప్రభుత్వ విద్యా, ఉద్యోగాల్లో బీసీలపై విధించిన క్రీమిలేయర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. క్రీమిలేయర్ రద్దు కోసం ఉద్యమం చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో బీసీ టీచర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటనారాయణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, వినోద్‌కుమార్, కృష్ణుడు, కోటేశ్వర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.