టీఆర్ఎస్లో చేరిన మరో టీడీపీ ఎమ్మెల్యే | rajendra nagar mla Prakash goud joins into trs | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్లో చేరిన మరో టీడీపీ ఎమ్మెల్యే

Mar 4 2016 8:01 PM | Updated on Mar 28 2018 11:26 AM

టీఆర్ఎస్లో చేరిన మరో టీడీపీ ఎమ్మెల్యే - Sakshi

టీఆర్ఎస్లో చేరిన మరో టీడీపీ ఎమ్మెల్యే

తెలంగాణ టీడీపీలో వలసల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.

హైదరాబాద్: తెలంగాణ టీడీపీలో వలసల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఇటీవల టీడీపీకీ ప్రకాశ్ గౌడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ప్రకాశ్‌గౌడ్ కూడా టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఎర్రబెల్లి ఇదివరకే టీఆర్ఎస్లో చేరగా, ఈ రోజు ప్రకాశ్ గౌడ్ గులాబీ కండువా కప్పుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement