హనుమంతప్ప త్వరగా కోలుకోవాలి: వైఎస్ జగన్ | prayers for speedy recovery of hanumanthappa, tweets ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

హనుమంతప్ప త్వరగా కోలుకోవాలి: వైఎస్ జగన్

Feb 10 2016 10:28 AM | Updated on Jul 25 2018 4:09 PM

హనుమంతప్ప త్వరగా కోలుకోవాలి: వైఎస్ జగన్ - Sakshi

హనుమంతప్ప త్వరగా కోలుకోవాలి: వైఎస్ జగన్

సియాచిన్ మంచుతుపానులో చిక్కుకుని, ఐదు రోజుల తర్వాత బయటపడిన వీర సైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.

సియాచిన్ మంచుతుపానులో చిక్కుకుని, ఐదు రోజుల తర్వాత బయటపడిన వీర సైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఆయనకు భగవంతుడు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

సియాచిన్ ప్రాంతంలో భారీ మంచుతుపాను కారణంగా మంచు చరియల కింద కూరుకుపోయి దాదాపు 10 మంది సైనికుల జాడ తెలియలేదు. వారిలో చివరకు లాన్స్‌నాయక్ హనుమంతప్ప మాత్రం కొన ఊపిరితో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దేశవాసులంతా హనుమంతప్ప బతకాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement