విద్యార్థిని దారుణ హత్య: నిందితుడి అరెస్ట్ | police found the details of mysterious death of girl in gandipet | Sakshi
Sakshi News home page

విద్యార్థిని దారుణ హత్య: నిందితుడి అరెస్ట్

Sep 19 2016 9:04 AM | Updated on Jul 30 2018 8:29 PM

విద్యార్థిని దారుణ హత్య: నిందితుడి అరెస్ట్ - Sakshi

విద్యార్థిని దారుణ హత్య: నిందితుడి అరెస్ట్

గండిపేటలోని ఓ ఫాంహౌస్ సమీపంలో దారుణంగా హత్యకు గురైన యువతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

రంగారెడ్డి:
గండిపేటలోని ఓ ఫాంహౌస్ సమీపంలో దారుణ హత్యకు గురైన యువతి కేసులో 24 గంటల్లోపే పోలీసులు పురోగతి సాధించారు. ఆదివారం హత్యకు గురైన విద్యార్థినిని అమీనాగా గుర్తించారు. ఫలక్‌నుమాలో అమీనా 9వ తరగతి చదువుకుంటోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అమీనాను బైక్‌ పై తీసుకువెళ్లిన వ్యక్తిని ఫలక్‌నుమాలో నివాసముంటున్న అక్బర్గా గుర్తించారు. (చదవండి: గొంతుకోసి, రాళ్లతో కొట్టి యువతి హత్య)


యువతి చేతులు, కాళ్లు కట్టేసి దుండగులు రాళ్లతో కొట్టి చంపిన విషయం తెలిసిందే. డబ్బుకోసమే అమీనాను హత్య చేశానని అక్బర్‌ పోలీసుల విచారణలో అంగీకరించాడు. మొదటగా డబ్బు కోసమే అమీనాను బెదించానని, డబ్బులు ఇవ్వకపోవడంతో బ్లేడుతో దాడి చేశానని చెప్పాడు. గాయపడ్డ అమీనా తనను ఆస్పత్రికి తీసుకెళ్తే డబ్బులు ఇస్తానందని తెలిపాడు. ఆసుపత్రి తీసుకెళ్తానని చెప్పి..మార్గమధ్యలో హత్య చేసినట్టు అక్బర్‌ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement