కండక్టర్‌పై చేయి చేసుకున్న ప్రయాణికురాలు | passenger beet of the conductor | Sakshi
Sakshi News home page

కండక్టర్‌పై చేయి చేసుకున్న ప్రయాణికురాలు

Apr 1 2015 12:26 AM | Updated on Sep 2 2017 11:38 PM

టికెట్ చిల్లర విషయంలో మహిళా కండక్టర్‌పై ఓ ప్రయాణికురాలు చేయిచేసుకున్న సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్

మలక్‌పేట:  టికెట్ చిల్లర విషయంలో మహిళా కండక్టర్‌పై ఓ ప్రయాణికురాలు చేయిచేసుకున్న సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... కూకట్‌పల్లి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఎల్బీనగర్ నుంచి యూసుఫ్‌గూడకు వెళ్తోంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో ఓ మహిళ బస్సెక్కింది. టికెట్‌కు సరిపడా చిల్లర ఇవ్వాలని కండక్టర్ అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ప్రయాణికురాలు కండక్టర్‌పై చేయిచేసుకుంది.  దీంతో బస్సును మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి ఆ ప్రయాణికురాలిని పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ప్రయాణికురాలు పుట్‌పాత్‌పై నివాసం ఉండే మహిళగా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల పసికందును కలిగి ఉన్న మహిళ మత్తులో ఉండడం గమనార్హం.
 

Advertisement
 
Advertisement
Advertisement