చెక్కులు, ఖాతాలకే రైతుల మొగ్గు

Parthasarathy on Investment subsidy - Sakshi

పెట్టుబడి రాయితీపై వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి  

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు పెట్టుబడి రాయితీ సొమ్మును ఎలా అందజేయాలన్న దానిపై తాము నిర్వహించిన సర్వేలో 60 శాతం మంది రైతులు చెక్కులు ఇవ్వాలని లేదా తమ బ్యాంకు ఖాతాలో వేయాలని సూచించారని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. సర్వే వివరాలను బుధవారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. తాము ఆరు పద్ధతులపై 62,677 మంది రైతులతో సర్వే నిర్వహించామన్నారు. వాటిలో పై రెండింటికి మెజారిటీ రైతులు మొగ్గు చూపారన్నారు. సర్వే ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.  

♦  చెక్కు రూపేణా ఇవ్వాలని కోరిన రైతులు– 31.58 శాతం. (జిల్లాల వారీగా చూస్తే సర్వేలో పాల్గొన్న రైతులలో మేడ్చల్‌ 63.8 శాతం మంది, నిజామాబాద్‌ 57.1 శాతం, ఆదిలాబాద్‌ 50 శాతం మంది, అలాగే 40 శాతానికి పైగా ఈపద్ధతిని కోరిన జిల్లాల్లో కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, సంగారెడ్డి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతులున్నారు)
 తమ బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్న రైతులు– 27.55 శాతం. (వరంగల్‌ అర్బన్‌ 81.55 శాతం, రాజన్న సిరిసిల్ల 62.38 శాతం, వరంగల్‌ రూరల్‌ 49 శాతం, జనగాంలో 44.94 శాతం మంది ఉన్నారు. అలాగే 30 శాతానికి పైగా కోరిన వారిలో నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నాగర్‌ కర్నూల్, మెదక్, నల్లగొండ, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల రైతులున్నారు)
 నగదు రూపంలో ఇవ్వాలన్నవారు– 26.59 శాతం. (జిల్లాల వారీగా చూస్తే – ఆసిఫాబాద్‌ 62.17 శాతం, వికారాబాద్‌ 48 శాతం, జోగుళాంబ గద్వాల 46.08 శాతం, రంగారెడ్డి జిల్లాలో 42 శాతంమంది ఉండగా, 30 శాతానికిపైగా నగదు రూపంలో కోరిన జిల్లాల్లో మహబూబ్‌నగర్, వనపర్తి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ రైతులున్నారు)
 పోస్టాఫీసుల ద్వారా ఇవ్వాలన్నవారు– 6.81 శాతం
 ప్రీలోడెడ్‌ కార్డులు/ఇతర రూపాల్లో కోరినవారు– 6.44 శాతం
c ప్రాథమిక సహకార సంఘాల ద్వారా కోరినవారు– 1.03 మంది

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top